News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
నిర్మల్: ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా ఉన్న నిర్మాణాల పురోగతిని మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె సూచించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News October 13, 2025
విజయవాడలో PGRSకు విశేష స్పందన

ప్రజా సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన PGRS కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 153 వినతులు, ఫిర్యాదులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు త్వరిత చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. నిర్లక్ష్యం, లేదా గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
News October 13, 2025
BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.