News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

గ్రామాల్లో మొదలైన ఎన్నికల కోలాహలం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో 5 మండలాల్లో 85 సర్పంచ్ స్థానాలకు తొమ్మిది ఏకగ్రీవం అయ్యాయి. 76 గ్రామపంచాయతీలు 295 మంది సర్పంచ్ అభ్యర్థులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, 519 వార్డుల్లో 1,377 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.

News December 4, 2025

నిర్మాత మృతి.. హీరో సూర్య కన్నీళ్లు

image

ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) <<18464480>>భౌతికకాయానికి<<>> సీఎం స్టాలిన్, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థివ దేహాన్ని చూస్తూ హీరో సూర్య, ఆయన తండ్రి శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య నటించిన సుందరాంగుడు, వీడొక్కడే సినిమాలను ఏవీఎం సంస్థే తెరకెక్కించింది. కాగా శరవణన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.

News December 4, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00