News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

గద్వాల: జీపీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎక్కడైనా వేలం వేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కమిషన్ లక్ష్యమన్నారు. నామినేషన్ సమయంలో ఎవరినీ ప్రలోభాలకు గురి చేయరాదని ఆయన స్పష్టం చేశారు.

News November 28, 2025

హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్‌లో బెస్ట్!

image

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT

News November 28, 2025

MBNR: జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్‌

image

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారీ సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల అధికారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.