News March 24, 2025
KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
MDK: చుక్కా రామయ్యకు శతవసంత శుభాకాంక్షలు: హరీష్ రావు

ప్రముఖ విద్యావేత్త ఐఐటీ రామయ్యగా పేరుపొందిన చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శతవసంత శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలో ఐఐటీ పాఠాలు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి మేథో దిక్సూచి అయిన మహోన్నతుడు ఆయన అని అన్నారు. అక్షరం ఆయుధం, నిరాడంబరత ప్రతిరూపం, క్రమశిక్షణకు మారుపేరు అయిన రామయ్య దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.
News November 20, 2025
‘వారణాసి’ కథ ఇదేనా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’కి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కథ ఇదేనంటూ ‘Letterboxd’లో పోస్ట్ చేసిన synopsis వైరల్ అవుతోంది. ‘వారణాసిని ఒక గ్రహశకలం ఢీకొన్నప్పుడు అది ఎలాంటి ఘటనలకు దారి తీస్తుంది. ప్రపంచం నాశనం అవుతుందా? దీన్ని ఆపేందుకు ఖండాలు, కాలక్రమాలను దాటాల్సిన రక్షకుడు అవసరమా?’ అని అందులో ఉంది. ఈ టైమ్ ట్రావెల్ కథలో మహేశ్ 2 పాత్రల్లో కనిపిస్తారని చర్చ సాగుతోంది.
News November 20, 2025
మదనపల్లె: పైపైకి టమాటా ధరలు.!

మదనపల్లెలో టమాటాల ధరలు రోజురోజుకూ పెరుగుతుండంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బుధవారం మార్కెట్కు 140 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకురాగా.. హోల్ సేల్ వ్యాపారులు 10 కిలోల మొదటిరకం టమాటా బాక్స్ను రూ.550, రెండోరకం టమాటాలను రూ.520, మూడోరకం టమాటా బాక్స్ను రూ.430తో కొనుగోలుచేసినట్లు సెక్రటరీ జగదీశ్ మీడియాకు తెలిపారు.


