News March 24, 2025
KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
తిరుపతి: 917 హెక్టార్లలో నీట మునిగిన పంట

రబీ సీజన్ ప్రారంభ దశలో ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం, మరో వైపు మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలకు నారు పోసి, నాట్లు వేశారు. విస్తారంగా కురిసిన వర్షాలకు దాదాపు 917 హెక్టార్ల మేర పంట నీట మునిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు తెలిపారు. వర్షాలు తగ్గి పొలంలో నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లిన అనంతరమే పూర్తి పంట నష్టాన్ని గుర్తించగలమని చెప్పారు.
News October 29, 2025
సొనాల: ఇందిరమ్మ లబ్ధిదారుడిని చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్

జిల్లాలోని సొనాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిని ఓ కాంట్రాక్టర్ చెట్టుకు కట్టేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. కోట (కే) గ్రామానికి చెందిన మారుతి భార్యకు ఇల్లు మంజూరు కాగా, బిల్లులు వచ్చిన వెంటనే ఇచ్చేలా కాంట్రాక్టర్ సత్యనారాయణతో ఇంటి నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల లక్ష రూపాయల బిల్లు వచ్చినా డబ్బులు ఇవ్వడం లేదని మారుతిని కాంట్రాక్టర్ మంగళవారం చెట్టుకు కట్టేశాడు.
News October 29, 2025
GWL: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి- కలెక్టర్ సంతోష్

విత్తన పత్తి రైతులకు ఇబ్బంది లేకుండా కంపెనీలు సహకరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం ఐడిఓసిలో జిల్లాలో విత్తనపత్తి సాగు చేస్తున్న రైతులకు ఆయా కంపెనీలు పెండింగ్ చెల్లింపులు, ఒప్పంద విషయంలో ఉన్న సమస్యలపై కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లాలో 46 వేల ఎకరాల్లో విత్తన పత్తి సాగు అయిందన్నారు. వారికి దాదాపు రూ.261 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే చెల్లించాలన్నారు.


