News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Similar News
News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
ఎన్ కౌంటర్లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.
News November 19, 2025
రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.


