News April 19, 2025

KU డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III.V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్‌) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

వికారాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో 7 మండలాల్లో 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 87.77% పోలింగ్ నమోదు కాగా, వికారాబాద్ మండలంలో అత్యధికంగా 87.77శాతం, అత్యల్పంగా బంట్వారం మండలంలో 80.25శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో 2,09,847 మంది ఓటర్లు ఉండగా 1,73,594 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

News December 15, 2025

చిన వెంకన్న సన్నిధిలో రేపటి నుంచి ధనుర్మాస శోభ

image

ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నెలగంట మోగనుండగా, 17 నుంచి స్వామివారి గ్రామోత్సవాలు మొదలవుతాయి. ఈ మాసమంతా ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవను నిర్వహిస్తామని ఈవో ఎన్వీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు.

News December 15, 2025

బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

image

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.