News October 13, 2025

KU: డిగ్రీ ఫీజు చెల్లింపునకు ఈనెల 23 వరకు గడువు

image

కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం బీఎస్సీ, బీ ఓకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం & సీటీ(రెగ్యులర్ & బ్యాక్ లాగ్) కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల పరీక్ష ఫీజు అపరాధ రుసుం లేకుండా ఈనెల 23 వరకు చెల్లించేందకు గడువు ఉందని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 25 వరకు ఉందన్నారు. పూర్తి వివరాలు వెబ్ సైట్లో చూడాలన్నారు.

Similar News

News October 13, 2025

ADB: భూముల కబ్జాలు.. సామాన్యుల హడలు

image

జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలు చేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు లెక్కచేయడం లేదు. ఈడీ స్వాధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేయగా నిందితులను అరెస్ట్ చేశారు. అంతకుముందు డబుల్ రిజిస్ట్రేషన్, నకిలీ పత్రాలు, స్టాంపులు తయారుచేస్తున్న వారిని పట్టుకున్నారు. సామాన్యులు భూములు కొనాలంటే భయపడుతున్నారు.

News October 13, 2025

APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

image

పుదుచ్చేరిలోని జిప్‌మర్ 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, MBBS/BDS, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 22లోగా అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://jipmer.edu.in/

News October 13, 2025

హిందూపురం: వ్యక్తి దారుణ హత్య

image

శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని సంతే బిదనూరు గ్రామ శివారులలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తిని కొట్టి చంపి అక్కడే పడేసి వెళ్లినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల గుర్తు పట్టని విధంగా మారిపోయిందని, వివరాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.