News April 20, 2024

KU డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశం

image

మే 6 నుంచి జరగబోయే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు కోసం ప్రతి సెమిస్టర్‌కి రూ. 250 అపరాధ రుసుముతో ఈ నెల 24 వరకు చెల్లించుకోవచ్చని యూనివర్సిటీ బోర్డు పేర్కొంది. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

Similar News

News November 11, 2025

సదరమ్ సర్టిఫికెట్ల మంజూరుకు రూ.2 కోట్ల వసూళ్లు?

image

జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విభాగంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకల్య శాతాన్ని పెంచేందుకు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20-40 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నలుగురు ఉద్యోగులు బృందంగా ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగుల నుంచి వసూళ్లకు పాల్పడటమేంటని జిల్లా వాసులు మండిపడుతున్నారు.

News November 11, 2025

పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. రైతులు తేమశాతం 12 లోపు ఉంచి పత్తి విక్రయించాలన్నారు. పత్తి కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమీప జిన్నింగ్ మిల్లుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. కౌలు రైతులు కూడా యాప్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

News November 11, 2025

విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

image

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.