News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

పంతిని సర్పంచ్‌గా శ్రీరామ్ భూపాల్‌రావు

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అర్షణపల్లి శ్రీరామ్ భూపాల్‌రావు 592 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగించిన ఆయన ప్రత్యర్థులపై స్పష్టమైన పైచేయి సాధించారు. ఫలితాలు వెలువడగానే గ్రామంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీరామ్ భూపాల్‌రావు తెలిపారు.

News December 14, 2025

సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక..

image

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. చిన్నగోని కాటంరాజు అనే వ్యక్తి BRS మద్దతుతో తొలి విడతలో మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. తప్పకుండా గెలుస్తానని నమ్మకం ఉన్నప్పటికీ 251 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డిప్రెషన్‌కు గురైన ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

News December 14, 2025

మోతడకలో త్వరలో పికిల్ క్లస్టర్: పెమ్మసాని

image

తాడికొండ(M) మోతడక గ్రామంలో రూ.2.3కోట్ల విలువైన బీసీ, ఎస్సీ, ఓసీకమ్యూనిటీ హాల్స్‌ని ఆదివారం కేంద్రసహాయమంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. పూలింగ్ ఇచ్చిన 29 గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, స్మశానవాటికలు, యూజీడి వంటి మౌలిక సదుపాయాలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందుతాయని భరోసా ఇచ్చారు. త్వరలో మోతడకలో రూ.5కోట్లతో పికిల్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.