News July 7, 2025

KU పరిధిలో 2,356 ఇంజినీరింగ్ సీట్లు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.

Similar News

News July 7, 2025

WGL: నేటి క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా

image

జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం HYD గాంధీభవన్‌లో నిర్వహించనున్న క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. కొండా దంపతుల వ్యతిరేక వర్గంతో భేటీ కానున్న కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. సోమవారం బల్దియాలో జరగనున్న కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ సమావేశం ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది.

News July 7, 2025

వీకాఫ్ కోసం ఏడుస్తున్నా: రష్మిక

image

స్టార్ హీరోయిన్ రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఏడాదిన్నరగా ఇంటికి వెళ్లలేదు. ఫ్రెండ్స్‌ను కలవలేదు. వీకాఫ్ కోసం ఏడుస్తున్నా. నాకంటే 16ఏళ్లు చిన్నదైన 13ఏళ్ల సోదరితో ఉండలేకపోయా. ఆమె ఇప్పుడు నా ఎత్తు ఉంది. ఆమె జర్నీని చూడలేకపోయా. కెరీర్‌లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని అమ్మ చెబుతుంటుంది. అయితే ఆ రెండింటినీ సమన్వయం చేసేందుకు కష్టపడుతున్నా’ అని పేర్కొన్నారు.

News July 7, 2025

హుజూర్‌నగర్: ట్రాక్టర్ పైనుంచి పడి మహిళా కూలీ మృతి

image

ట్రాక్టర్ పైనుంచి జారిపడి మహిళా కూలీ మృతిచెందిన ఘటన రఘునాథపాలెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. హుజూర్‌నగర్(M) గోపాలపురానికి చెందిన అలకుంట నవనీత(27) ఇంటి స్లాబ్ పనికి వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వస్తుండగా మట్టంపల్లి(M) రఘునాధపాలెం గ్రామశివారులో డ్రైవర్ అకస్మాత్తుగా కటింగ్ ఇవ్వడంతో ట్రాక్టర్‌పై కూర్చున్న ఆమె అదుపుతప్పి కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన నవనీతను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.