News September 3, 2025

KU: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి

image

వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. KUC పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయగణపతి రోడ్ నం.15లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ విటుడు, నిర్వాహకుడితో పాటు ఇద్దరు బాధితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Similar News

News September 4, 2025

చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

image

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కలిశారు.

News September 4, 2025

గుంటూరు వాసికి అరుదైన గౌరవం

image

గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్‌ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. బల్ద్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఆర్బీ అవార్డు వరించింది. అమెరికాలో ఎంతో ప్రతిభ కనబర్చిన సీఈవోలు, టెక్‌ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ (రాజ్‌) 2025 ఏడాదికిగానూ లార్జ్‌ కార్పొరేట్‌ విభాగంలో ఆర్బీ అవార్డును అందుకున్నారు.

News September 4, 2025

నిర్మల్: ఈనెల 6న వైన్స్ బంద్

image

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని అన్ని వైన్‌ షాపులు, బార్‌లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.