News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Similar News
News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

పెద్దపల్లి(D) ఎలిగేడు(M) ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో న్యూస్‌లైన్ నిర్వాహకుడు, యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఓ మహిళ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు అంబర్ పేట పోలీసులు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.