News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Similar News
News September 16, 2025
ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
News September 16, 2025
GST ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన మదర్ డెయిరీ

GST శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. లీటర్ పాల ధర ప్రస్తుతం రూ.77 ఉండగా రూ.75కు తగ్గించామని తెలిపింది. నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్స్ రేట్లనూ తగ్గించినట్లు వెల్లడించింది. పాలపై సున్నా, మిగతా ఉత్పత్తుల(పనీర్, బట్టర్, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్)పై 5% జీఎస్టీ ఉంటుందని తెలిపింది.
News September 16, 2025
GDK: ‘సెలవులకు ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి’

దసరా సెలవులకు ఊర్లకు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి DCP P.కరుణాకర్ సూచించారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వారికి సమాచారం ఇస్తే పెట్రోలింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఊర్లకు వెళ్తే విలువైన వస్తువులను ఇండ్లలో వదిలి వెళ్లవద్దని, బ్యాంక్ లాకర్‌లో భద్ర పరుచుకోవాలని సూచించారు. ఇంటిని గమనిస్తూ ఉండాలని చుట్టూ పక్కల వారికి తెలిపి వెళ్లాలని సూచించారు.