News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News March 31, 2025
IPL: చెన్నైని దాటేసిన ఆర్సీబీ

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న IPL జట్టుగా ఆర్సీబీ నిలిచింది. మొత్తంగా 17.8 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానానికి ఎగబాకింది. దీంతో ఇప్పటివరకు మొదటి ప్లేస్‌లో ఉన్న CSK(17.7M)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో MI(16.2M) ఉంది. కాగా ముంబై, చెన్నై తలో 5 సార్లు టైటిల్ గెలవగా ఆర్సీబీ ఖాతాలో ఒక్కటీ లేదు. అయినా ఫాలోయింగ్‌లో మాత్రం అదరగొడుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News March 31, 2025
ఆ 400 ఎకరాలు మాదే: టీజీ ప్రభుత్వం

TG: భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ HCU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆ 400 ఎకరాల భూమి తమదేనని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో HCUకు సంబంధించిన భూమి లేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలిపింది. వేలం, అభివృద్ధి కోసం రాళ్ల తొలగింపు ఉండదని చెప్పింది.
News March 31, 2025
KMR: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రంజాన్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.ఎస్పి చైతన్య రెడ్డి. జిల్లా అధికారులు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.