News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 27, 2025

వరంగల్: డ్రగ్స్ వేర్ హౌస్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

వరంగల్ పట్టణంలో రంగశాయిపేట యూపీహెచ్‌సి ప్రాంగణంలో సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అధికారులపై సిబ్బంది ఔషధాల స్టాక్, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించి, విధులకు గైరుహజరైన సూపర్వైజర్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 27, 2025

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి మంగళవారం రూ.10,800 ధర పలకగా.. నేడు రూ.10,500 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.28,000 ధర వచ్చింది. సింగిల్ పట్టికి నిన్న రూ.27వేలు రాగా నేడు రూ.29వేల ధర పలికింది. దీపిక మిర్చి నిన్న రూ.13,300 ధర రాగా నేడు రూ. 13వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News March 26, 2025

నల్లబెల్లి: మిషన్ భగీరథ పంప్ హౌస్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

నారక్కపేట గ్రామ పరిధిలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పంప్ హౌస్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. పైప్ లీకేజ్ మరమత్తు పనులు త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, మండల తహశీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

error: Content is protected !!