News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News December 18, 2025

సిరిసిల్ల: 4 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం

image

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అధికంగా గెలిచారు. ఎల్లారెడ్డిపేటలో 11, ముస్తాబాద్‌లో 13, గంభీరావుపేటలో 11, వీర్నపల్లిలో 8, మొత్తం 43 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 9, ఇండిపెండెంట్ అభ్యర్థులు 17, ఒక సీపీఐ అభ్యర్థి గెలిచారు.

News December 18, 2025

KMM: కల్లూరులో ఎక్కువ.. సింగరేణిలో తక్కువ

image

ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.72 శాతం పోలింగ్‌తో కల్లూరు ముందు వరుసలో ఉంది. వేంసూరు 90.63%, ఏన్కూరు 89.50%,పెనుబల్లి 88.98%,తల్లాడలో 88.14%,సత్తుపల్లిలో 87.36%, సింగరేణిలో 87.29% శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన 3వ విడతలో 2,43,983 లక్షల ఓటర్లుండగా, వారిలో 2,16,765 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

పాలమూరు పంచాయతీ పోరు: కాంగ్రెస్‌ హవా

image

పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో ముగిసిన 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 77 మండలాలలోని 1,678 సర్పంచి స్థానాలకు గాను కాంగ్రెస్‌ మద్దతుదారులు అత్యధికంగా 964 చోట్ల విజయం సాధించారు. BRS బలపరిచిన అభ్యర్థులు 482స్థానాల్లో గెలవగా.. BJP 75 పీఠాలను దక్కించుకుంది. మరో 150చోట్ల స్వతంత్రులు, ఇతరులు విజేతలయ్యారు. మొత్తం 15,068 వార్డు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులే నెగ్గారు.