News April 29, 2024
మే 2న ‘కుబేర’ టీజర్

తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ సినిమా టీజర్ మే 2న రిలీజ్ కానుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Similar News
News January 16, 2026
రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశం!

జియో పాలిటిక్స్, పాక్ నుంచి ఉగ్రవాదం నేపథ్యంలో రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అనుమతులతో అవసరం లేని ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో 49% వరకు FDIలకు అవకాశం ఉంది. దీన్ని 74% పెంచనుందని ‘రాయిటర్స్’ పేర్కొంది. భారత భాగస్వామి కంపెనీల్లో విదేశీ రక్షణ సంస్థలకు మెజార్టీ వాటాకు అవకాశం కల్పించనుంది. ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని తెలిపింది.
News January 16, 2026
మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.
News January 16, 2026
ట్రంప్ ఒత్తిడితో మోదీ చాబహార్ పోర్టును వదిలేశారు: కాంగ్రెస్

PM మోదీ మరోసారి ట్రంప్కు సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడితో ఇరాన్లోని చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని పేర్కొంది. 120 మిలియన్ డాలర్ల భారత ట్యాక్స్ పేయర్ల డబ్బును మోదీ అందులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడది వృథా అయిందని విమర్శించింది. అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఏషియాకు వెళ్లేందుకు ఈ పోర్ట్ ఎంతో కీలకమని తెలిపింది. మోదీ దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.


