News January 26, 2025
కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.
Similar News
News January 27, 2025
జార్జియా ఐలాండ్ను ఢీకొట్టనున్న భారీ ఐస్ బర్గ్
జార్జియా ఐలాండ్ను ప్రపంచంలోనే అతి పెద్ద మంచు కొండ ఢీకొట్టనుంది. ముంబైలాంటి ఆరు నగరాల విస్తీర్ణంతో ఇది సమానం. ఇది జార్జియా ద్వీపాన్ని ఢీకొడితే ప్రమాదం తీవ్రంగానే ఉంటుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని బరువు కొన్ని ట్రిలియన్ టన్నులు ఉండొచ్చని అంచనా. అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి ఇది 1986లో విడిపోయింది. అప్పటి నుంచి కదులుతూ ఇప్పుడు జార్జియా దీవి సమీపంలోకి వచ్చింది.
News January 27, 2025
సీఎం రేవంత్ అభిప్రాయాన్ని పరిశీలించండి: విజయశాంతి
TG: కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగైనా ప్రకటించాల్సిందని సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది ఎంపీలు ఉన్న బీజేపీ దీనిపై ఆలోచించడం మంచిది. సీఎం రేవంత్ అభిప్రాయాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నా’ అని ఆమె పేర్కొన్నారు.
News January 27, 2025
మమతా కులకర్ణి సన్యాసం డ్రామానా?
1990ల్లో ఓ ఊపు ఊపిన హీరోయిన్ మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రూ.2,000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్లో ఆమె పాత్రధారి అని, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే సన్యాసిని అవతారం ఎత్తారని అంటున్నారు. సన్యాసం తోటి తన పాపాలు అన్నీ కడిగేసుకున్నట్లుగా ఆమె ఫోజులు కొడుతున్నారని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్.