News February 4, 2025
కుంభమేళా తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదు: హేమామాలిని
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.
Similar News
News February 4, 2025
జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన అభిమానులను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని అనుమతులు తీసుకొని ఈవెంట్ నిర్వహించడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఓర్పుతో ఉండాలని కోరింది. అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.
News February 4, 2025
ఎస్సీ రిజర్వేషన్లు: కమిషన్ సిఫారసులు ఇవే
TG: 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు.
*గ్రూప్-1లోని 15 ఉపకులాలకు (3.288% జనాభా) 1 శాతం రిజర్వేషన్
*గ్రూప్-2లోని 18 ఉపకులాలకు (62.748% జనాభా) 9 శాతం
*గ్రూప్-3లోని 26 ఉపకులాలకు (33.963% జనాభా) 5 శాతం
*క్రిమీలేయర్ అమలు చేయాలని సిఫారసు చేసిందని కానీ క్యాబినెట్ దాన్ని తిరస్కరించిందని సీఎం తెలిపారు.
News February 4, 2025
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం
ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన NCAలో ఉన్నారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.