News September 7, 2024
గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకంటే…

వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని <
News December 7, 2025
సర్పంచ్‌గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: లోకేశ్

AP: గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని.. రాష్ట్రంలోనూ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ‘కలిసికట్టుగా పనిచేస్తామని పవనన్న పదేపదే చెబుతున్నారు. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని డలాస్ తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేశ్ తెలిపారు.


