News March 17, 2024
కర్నూలు: ఒకే రోజు 24 పోటీలు.. విజయం సాధించిన జట్లు ఇవే..

ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఒకే రోజు జరిగిన 24 పోటీల్లో శ్రీకాకుళంపై రాయలసీమ యూనివర్సిటీ, జై నారాయణ వ్యాస్ విశ్వ విద్యాలయంపై కొచ్చిన్ విశ్వవిద్యాలయం, జైపూర్ నిర్వాణ విశ్వ విద్యాలయంపై యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, మాధవ్ యూనివర్సిటీ పింద్వరాపై మౌలానా ఆజాద్ జోడ్పూర్ విజయం సాధించాయి.
Similar News
News August 31, 2025
రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుంది: కలెక్టర్

మార్క్ఫెడ్ ద్వారా రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అధికారులతో ఉల్లి కొనుగోలు అంశంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు.
News August 31, 2025
ఒకే గ్రామంలో 8 మందికి టీచర్ ఉద్యోగాలు

దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 8 మంది డీఎస్సీలో సత్తా చూపారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని, వారి తల్లిదండ్రులను బీసీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బుజ్జమ్మ సన్మానించారు. తన ఊరిలో 8 మంది ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం ఆనందంగా, గర్వంగా ఉందని ఆమె తెలిపారు.
News August 31, 2025
నందవరం: గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ కుటుంబం

ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం కష్టంగా ఉన్న ఈ పోటీ ప్రపంచంలో నందవరానికి చెందిన కురవ పెద్దనాగన్న, హనుమంతమ్మ కుమారుడు K.P నాగరాజు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. రైల్వే, సచివాలయం ఉద్యోగాలు సాధించి తాజాగా విడుదలైన డీఎస్సీలో (SA సోషల్) కొలువు సాధించాడు. నాగరాజు అన్న హెడ్ కానిస్టేబుల్, తమ్ముడు 2012 DSC లో SGTగా ఉద్యోగం సాధించారు. పెద్దనాగన్న కుమారులు గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.