News October 26, 2025

కర్నూలు ప్రమాదం.. శివశంకర్ ఫోన్‌తో ఎర్రిస్వామి ఆచూకీ!

image

కర్నూలు <<18087387>>దుర్ఘటనకు<<>> సంబంధించి శివశంకర్ సెల్‌ఫోన్ ద్వారా అతడి ఫ్రెండ్ ఎర్రిస్వామి ఆచూకీని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ప్రమాదం తర్వాత శివశంకర్ బాడీని పక్కకు జరిపి, అతడి సెల్‌ఫోన్‌ను ఎర్రిస్వామి తీసుకెళ్లాడని సమాచారం. ఘటనా స్థలిలో శివ‌శంకర్ ఫోన్ లభించకపోవడంతో నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. రాంపల్లిలో<<18100306>> ఎర్రిస్వామి వద్ద<<>> ఉందని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు.

Similar News

News February 13, 2026

టీమ్ ఇండియాకు అతిపెద్ద విజయం

image

నమీబియాతో మ్యాచులో 93 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. T20 WCలో పరుగులు పరంగా మెన్ ఇన్ బ్లూకు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2012లో ఇంగ్లండ్‌పై 90, 2014లో ఆస్ట్రేలియాపై 73, 2022లో జింబాబ్వేపై 71 రన్స్ తేడాతో గెలిచింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుస విజయాల సంఖ్య 10కి చేరింది. గత మ్యాచులో సౌతాఫ్రికా(8) రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.

News February 13, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.