News October 31, 2025
కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.
Similar News
News October 31, 2025
భారత్‌కు బిగ్ షాక్

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత టాపార్డర్ కుప్పకూలింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గిల్ 5 రన్స్ చేసి ఔట్ కాగా తర్వాత సంజూ 2, సూర్య 1, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 9 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 24 రన్స్ చేశారు.
News October 31, 2025
ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.
News October 31, 2025
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (1/2)

ఆంధ్రప్రదేశ్‌లో బొండానికి, టెంకాయకు మేలైన కొబ్బరి రకాలు.
☛ ఈస్ట్‌కోస్ట్ టాల్: ఇది దేశవాళి పొడవు రకం. నాటిన 6 ఏళ్లలో కాపునకు వస్తుంది.  చెట్టుకు ఏడాదికి 80-100 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గౌతమి గంగ: ఇది పొట్టి రకం. నీటి బొండాలకు బాగా ఉపయోగపడుతుంది. నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 85-90 కాయల దిగుబడి వస్తుంది. కాయలో నూనె దిగుబడి 69 శాతం. 


