News March 17, 2024
కర్నూలు: CM జగన్ బహిరంగ సభ వాయిదా

ఆలూరులో ఈనెల 20వ తేదీ నిర్వహించవలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆలూరు వైసీపీ అబ్జర్వర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం బహిరంగ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.
Similar News
News January 26, 2026
వ్యవసాయ శకటానికి మొదటి స్థానం: కలెక్టర్

77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షతన పోలీస్ పరేడ్ మైదానంలో ప్రదర్శించిన శకటాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి, దేవాదాయ శాఖ శకటానికి 2వ బహుమతి, జిల్లా విద్యా శాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శకటాలకు 3వ బహుమతిని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం వారికి జేసీ, ఎస్పీలతో కలిసి జ్ఞాపకలను అందజేశారు.
News January 26, 2026
అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: కలెక్టర్

సమిష్టి కృషితో జిల్లాని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కర్నూలులో 77వ గణతంత్ర వేడుకలలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్తో కలిసి కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని కలెక్టర్ చదివి ప్రజలకు వినిపించారు. అంతకుముందు వారు ఆయుధ దళాల నుంచి గౌరవ వందనాలు స్వీకరించారు.
News January 26, 2026
కర్నూలు కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు

77వ గణతంత్ర వేడుకలు సోమవారం కర్నూలు కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. అంతకుముందు పోలీసులు కలెక్టర్కు గౌరవ వందనం సమర్పించి, స్వాగతం పలికారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచారు.


