News March 17, 2024

కర్నూలు: ఈనెల 20న సీఎం జగన్ రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న సీఎం జగన్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఆలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ విజయం సాధిందించి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కాదని విరుపాక్షికి టికెట్ కేటాయించడంతో మూడోసారి వైసీపీ జెండా ఎగరాలని సీఎం పర్యటిస్తున్నట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.

Similar News

News December 29, 2025

కర్నూలు: ‘నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలి’

image

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత www.ncs.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి సూచించారు. మొబైల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, కెరీర్ మార్గదర్శనం, జాబ్ మేళాల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలుంటే జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News December 29, 2025

ప్రజా ఫిర్యాదుల వేదికలో 101 విన్నపాలు

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 101 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పలువురు సీఐలు పాల్గొన్నారు.

News December 29, 2025

కర్నూలు: తిరుమల వెళ్లి వస్తుండగా విషాదం

image

ఒంటిమిట్ట మండలంలోని మట్టంపల్లి-నందలూరు మధ్య ఆదివారం సాయంత్రం పూణే ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ తెలిపారు. మృతుడు కర్నూలు జిల్లా అప్సరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.