News October 20, 2024

KVపల్లె: పిడుగు పాటుకు గురై వ్యక్తి మృతి

image

పిడుగుపాటు ఓ ఇంట తీరని విషాదాన్ని నింపిన ఘటన నేడు KVపల్లె మండలంలో జరిగింది. నూతనకాల్వ గ్రామం గుట్టలపై నడింపల్లెకు చెందిన నాగరాజ నాయుడు(45) నేడు పొలం వద్ద పనులు చేస్తుండగా ఉన్న ఫళంగా పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు ఆయన భార్య పార్వతి(37), తల్లి చిన్నక్క(70) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2024

తిరుపతి జిల్లాలో రేపు పాఠశాలలకు హాలీడే బంద్ 

image

తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య (ప్రభుత్వ, ప్రైవేటు) పాఠశాలలకు రేపు పని దినంగా ప్రకటించినట్లు DEO కేవీఎన్.కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇదివరకే అధిక వర్షాలతో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. దీంతోపాటూ అపార్, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-I, పేపర్ II మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయుటకు తప్పకుండా పని చెయ్యాలని ఆదేశించారు.

News November 9, 2024

చిత్తూరు: గో షెడ్లకు జియో ట్యాగింగ్ తప్పనిసరి

image

జిల్లాలోని గోకులం షెడ్లకు జియో ట్యాగింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 2,327 షెడ్లు మంజూరు కాగా 1,911కు సాంకేతిక మంజూరు ఇచ్చామన్నారు1,377కు జియో టాకింగ్ పూర్తి చేశామని తెలిపారు. 460 పనులు గ్రౌండింగ్ అయిందని, పనులు మంజూరైన చోట టెక్నికల్ శాంక్షన్ వచ్చిన వెంటనే జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు.

News November 8, 2024

చిత్తూరు జిల్లా పాఠశాలలకు రేపు సెలవు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు డీఈవో వరలక్ష్మి రెండో శనివారం  సెలవు ప్రకటించారు. సెలవు రోజు ఎవరైనా తరగతులు నిర్వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో ఉపాధ్యాయులు అపార్ కార్డు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లా పాఠశాలలకు ఈ సెలవు వర్తించదు.