News April 23, 2025

KZR : మే 20లోపు ఏకరూప దుస్తుల పంపిణీ: DEO

image

మే 20 లోపు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నేడు కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాలను సందర్శించి, సకాలంలో దుస్తులను అందించాలన్నారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, నైపుణ్యాన్ని పరిశీలించారు.

Similar News

News April 24, 2025

సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

image

TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.

News April 24, 2025

ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

image

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్‌లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900,  సోషల్‌లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్‌లో 1, మ్యాథ్స్ 22, సైన్స్‌ 21, సోషల్‌లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.

News April 24, 2025

నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

image

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.

error: Content is protected !!