News September 25, 2024
L.H.M.S సేవలు సద్వినియోగం చేసుకోండి: GNT ఎస్పీ
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (L.H.M.S)ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల ఆస్థుల పరిరక్షణకు L.H.M.S రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని, ఈ యాప్‌ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపకరిస్తుందని అన్నారు.
Similar News
News October 5, 2024
పట్టభద్రులు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లగా నమోదు చేసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. శుక్రవారం, కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గములో ఓటర్ల నమోదుకు అర్హులైన వారు www.ceoandhra.nic.in వెబ్ సైటు ద్వారా ఫారం- 18 సమర్పించాలన్నారు. నవంబరు 23, 2024 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.
News October 4, 2024
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: మంత్రి నారా లోకేశ్
తిరుమల లడ్డూ ఘటనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు Xలో ట్వీట్ చేశారు. సత్యం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.
News October 4, 2024
గుంటూరు: నేడే వైసీపీ జిల్లా అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ
వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, నర్సరావుపేట లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే పదవీ ప్రమాణస్వీకార సభలో రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు అవుతారని చెప్పారు.