News March 28, 2025
కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?
Similar News
News March 31, 2025
నేహా కక్కర్ కన్సర్ట్.. నిర్వాహకులకు రూ.4.52 కోట్ల నష్టం

బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్ వల్ల తమకు రూ.4.52 కోట్ల ($5,29,000) నష్టం వచ్చినట్లు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆమె షో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌కు నేహా 3 గంటలు ఆలస్యంగా వెళ్లారు. దీంతో తనకు నిర్వాహకులు డబ్బులు చెల్లించలేదని ఆమె ఆరోపించారు.
News March 31, 2025
నేడు 38 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News March 31, 2025
హమాస్ ఆయుధాలు వీడితేనే: నెతన్యాహు

హమాస్ ఆయుధాలు వీడి, గాజాలోని తమ బందీలను విడుదల చేస్తేనే <<15933999>>కాల్పుల విరమణ<<>> గురించి ఆలోచిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ నేతలందరూ గాజాను వీడి పారిపోవాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. గాజాలో ట్రంప్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. కాగా నిన్న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 22 మంది మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు సివిల్ డిఫెన్స్ తెలిపింది.