News April 17, 2025
ఈ నెల 24న OTTలోకి ‘L2: ఎంపురాన్’

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 24 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
Similar News
News April 19, 2025
KOHLI: 18 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్

నిన్న (ఏప్రిల్ 18) RCB vs PBKS మ్యాచులో ఓ యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయంలో 18 ఏళ్ల తర్వాత ఓ ఫీట్ రిపీటైంది. 2008 ఏప్రిల్ 18న కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో, నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచులోనూ విరాట్ ఒక్క పరుగే చేశారు. ఈ రెండు మ్యాచులూ చిన్నస్వామి స్టేడియం వేదికగానే జరగడం గమనార్హం. కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం గమనార్హం.
News April 19, 2025
విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.
News April 19, 2025
వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు: హైకోర్టు

వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మహాభారత కాలంలోలాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్‌లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.