News February 7, 2025

RTC జేఏసీని చర్చలకు పిలిచిన కార్మిక శాఖ

image

TGSRTC జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చల్లో పాల్గొనాలని పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.

Similar News

News February 7, 2025

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 7, 2025

గురుకులాలు, హాస్టళ్లకు నిధులివ్వండి: మంత్రి స్వామి

image

AP: PM-AJAY పథకం కింద ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110cr విడుదల చేయాలని కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, రామ్‌దాస్ అథవాలేను మంత్రి స్వామి కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన 75 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి రూ.245cr, గురుకులాల్లో మౌలిక వసతులకు రూ.193cr.. SC, ST అట్రాసిటీ బాధితులకు రూ.95.84cr, తదితరాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వీటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

News February 7, 2025

TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి

image

TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్‌ ఖాన్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!