News August 9, 2025
నిర్మాతలతో కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలం

వేతనాల పెంపుపై <<17354311>>నిర్మాతలతో<<>> కార్మిక ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని, 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ను విభజించేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పారు.
Similar News
News August 10, 2025
మరోసారి సాగర్ గేట్లు ఎత్తే అవకాశం!

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. శ్రీశైలం జలాశయం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 43,999 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 309.35 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో పెరిగితే ఏ క్షణమైనా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
News August 10, 2025
రాఖీ పండుగ.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో

TG: నవ్వుతూ సోదరుడికి రాఖీ కట్టాల్సిన రోజు ఐదుగురు అక్కలు తమ్ముడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రానికి చెందిన యాకయ్య (50) అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఐదుగురు అక్కలు కంటతడి పెడుతూ తమ్ముడి ఇంటికి చేరుకున్నారు. ఆపై మృతదేహానికి చివరిసారి రాఖీ కట్టి విలపించారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.
News August 9, 2025
రికార్డు స్థాయిలో భారత రక్షణ ఉత్పత్తులు

భారత డిఫెన్స్ ప్రొడక్షన్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25లో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,50,590 కోట్లకు చేరింది. ఈ మేరకు డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది రూ.1.27 లక్షల కోట్లు ఉన్న ప్రొడక్షన్ వాల్యూ ఇప్పుడు 18 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తుల్లో పబ్లిక్ సెక్టార్ వాటానే 77% కావడం విశేషం. దిగుమతులు తగ్గించుకుని ఇతర దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసే దిశగా భారత్ సాగుతోంది.