News July 5, 2024
బ్రిటన్లో అధికారం దిశగా లేబర్ పార్టీ!

బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటివరకు 292 సీట్లను గెలుచుకుంది. రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ 56 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 650 స్థానాలకు గాను ఇప్పటివరకు సగానికి పైగా నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. లేబర్ పార్టీ అధికారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రిషి సునాక్ రిచ్మండ్&నార్తలర్టన్ స్థానానికి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.
Similar News
News October 17, 2025
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ సక్రమంగా పనిచేసేలా చూడాలని పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం సమీక్షలో ఆమె మాట్లాడారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతల రోజువారీ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్దేశిత ప్రకారం జరిగేలా చూడాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తన పనితీరును మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు.
News October 17, 2025
ALERT.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
News October 17, 2025
లిక్కర్ షాపులకు నో ఇంట్రెస్ట్!

TG: లిక్కర్ షాపుల దరఖాస్తులకు అనుకున్నంత స్పందన రావట్లేదు. గతంతో పోలిస్తే నిన్నటి వరకు 55% తక్కువ దరఖాస్తులు రావడంతో అప్లికేషన్లు సమర్పించాలని అబ్కారీ శాఖ వ్యాపారులకు SMSలు పంపుతోంది. ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అలాగే గత మూడేళ్లతో పోల్చితే 2024లో అమ్మకాలు, లాభాలు తగ్గాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం.
*దరఖాస్తులకు రేపే చివరి తేదీ.