News January 19, 2025

రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.

Similar News

News December 31, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. గ్రీన్ కార్డున్నా ప్రయాణించడానికి భయం!

image

USలో ఉంటున్న వలసదారులు ఇప్పుడు ప్రయాణాలంటేనే భయపడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం నిఘా పెంచడంతో దాదాపు 27% మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు, ఇమిగ్రెంట్స్ తమ ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇతర దేశాలకే కాదు.. USలో ప్రయాణించడానికీ వెనకాడుతున్నారు. విమానాశ్రయాల్లో చెకింగ్ కఠినం చేయడం, ICEకి సమాచారం ఇస్తుండటంతో ఆందోళన పెరిగింది. అక్రమ వలసదారులే కాదు H-1B వీసా ఉన్నవారూ రిస్క్ తీసుకోవట్లేదు.

News December 31, 2025

GRSEలో 107 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ &ఇంజినీర్స్ లిమిటెడ్ (<>GRSE<<>>)లో 107పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, LLB, MBBS, పీజీ, పీజీ డిప్లొమా, ICSI, BSc, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.grse.in

News December 31, 2025

Happy New Year

image

భారతదేశం మరో 8.30గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్టమస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లిపోయింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు నూతన సంవత్సరం ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్‌లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లోనూ న్యూ ఇయర్ మొదలవనుంది.