News February 10, 2025
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు: అంబటి

AP: రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కూడా వంత పాడుతున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు వచ్చాకే AR సప్లైస్ నెయ్యి సరఫరా చేసింది. మరి మా హయాంలో లడ్డూ ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది? లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని పచ్చి అబద్ధం ఆడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News October 17, 2025
లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న

మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట ఆ పార్టీ అగ్రనేత ఆశన్న(తక్కెళ్లపల్లి వాసుదేవరావు) లొంగిపోయారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు బస్తర్ జిల్లా జగదల్‌పుర్‌లో 208 మంది మావోయిస్టులు సైతం అస్త్ర సన్యాసం చేశారు. వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. వారి వద్ద ఉన్న 153 తుపాకులు, 11 గ్రానైడ్ లాంచర్లను అప్పగించారు.
News October 17, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఉద్యోగాలు

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ -బీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్: https://www.prl.res.in/
News October 17, 2025
పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మొదలైంది. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా, కొన్నిచోట్ల పొగమంచు ఏర్పడుతోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్లు, బైకులు, ఇతర వాహనాలు నడిపేవారు ఈ సమయంలో నిదానంగా వెళ్లడం మేలు. అలాగే పాటు ఫాగ్‌లైట్స్, బీమ్ హెడ్‌లైట్స్ ఉపయోగించాలని, ఓవర్టేక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.