News September 20, 2024

లడ్డూ వివాదం.. హైకోర్టుకు వైసీపీ!

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించనుంది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. అయితే వచ్చే బుధవారం వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

Similar News

News September 20, 2024

గ్రీస్‌లో ఇష్టమొచ్చినట్టు ఇళ్లు కొంటున్న ఇండియన్స్

image

జులై, ఆగస్టులో గ్రీస్‌లో భారతీయ ఇన్వెస్టర్ల ఇళ్ల కొనుగోళ్లు 37% పెరిగాయి. ఆ దేశ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ రూల్స్ మారడమే దీనికి కారణం. అక్కడ ఇల్లు కొంటే శాశ్వత నివాసం పొందొచ్చు. 2013లో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో మొదట రూ.2.2 కోట్లు పెట్టుబడి పెడితే చాలు. తక్కువ డబ్బే కాబట్టి ఏథెన్స్ వంటి నగరాల్లో భూముల రేట్లు కొండెక్కాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సెప్టెంబర్1 నుంచి పెట్టుబడిని రూ.7 కోట్లకు పెంచారు.

News September 20, 2024

సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్

image

భారత సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఇందులో అమెరికాకు చెందిన రిపిల్ అనే డిజిటల్ చెల్లింపుల సంస్థకు సంబంధించిన XRP, క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలను హ్యాకర్లు పోస్టు చేశారు. కేసుల విచారణను ప్రసారం చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీం కోర్టు వినియోగిస్తోంది.

News September 20, 2024

మధ్యాహ్నం జగన్ ప్రెస్‌మీట్!

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంపై, కూటమి 100 రోజుల పాలన తీరుపై ఆయన మీడియాతో మాట్లాడతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.