News November 16, 2024

లేడీస్ ‘ఫస్ట్’

image

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఫస్ట్ ఫేజ్‌ పోలింగ్‌లో మహిళా ఓటర్లే ఎక్కువశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పురుషుల కంటే 4.8శాతం ఎక్కువగా ఆడవారి ఓట్లే నమోదయ్యాయని తెలిపింది. కాగా ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో 66.66% పోలింగ్ నమోదైంది. 2019 పోలింగ్ కంటే 2.75శాతం అధికమని ఈసీ వివరించింది.

Similar News

News November 16, 2024

మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి!

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్లు రూ.25 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. FIR ప్రకారం.. డిప్యూటీ SPగా పనిచేసి రిటైరైన జగదీశ్‌కు UP ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇప్పిస్తామని నమ్మబలికి కొంతమంది రూ.25 లక్షలు తీసుకున్నారు. పని అవ్వకపోవడంతో డబ్బు తిరిగివ్వమని అడగ్గా చంపేస్తామని బెదిరించారు. నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

News November 16, 2024

ఒక శాతం జీఎస్టీ పెంపునకు అనుమతించండి: సీఎం చంద్రబాబు

image

AP: సెప్టెంబర్‌లో సంభవించిన వరదలతో విజయవాడ అతలాకుతలమైందని CM చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర GSTపై తాత్కాలికంగా 1% సర్‌ఛార్జీని విధించే వెసులుబాటు కల్పించాలని కోరారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు ₹60వేల కోట్లకుపైగా వ్యయమవుతుందని, త్వరలోనే DPRను కేంద్రానికి పంపుతామని పేర్కొన్నారు.

News November 16, 2024

44 శాతం ఇళ్లలో సర్వే పూర్తి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్ల ఇళ్లకుగాను 51.24 లక్షల(44.1శాతం) నివాసాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సర్వేలో 87,807 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, 8,788 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సర్వే తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రజల అభ్యున్నతి కోసమే సర్వే చేస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలి’ అని సూచించారు.