News February 4, 2025
రోడ్డు ప్రమాదంలో లేడీ ఎస్సై మృతి
TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్నారు.
Similar News
News February 4, 2025
రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా
TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్కో <
News February 4, 2025
కేసీఆర్ కుటుంబానికి ప్రధాని సానుభూతి
TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News February 4, 2025
ఫారినర్స్ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్
విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.