News May 20, 2024
తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్ ప్రమాణం

తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్ తే బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మాజీ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ హయాంలో ఈయన గత నాలుగేళ్లు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా లై చింగ్ చైనాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పరిరక్షణలో తైవాన్ వెనకడుగు వేయదని.. చైనా తన బెదిరింపులను మానుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.
News December 7, 2025
6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News December 7, 2025
తల్లయిన హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్నారు.


