News February 8, 2025
‘లైలా’కు A సర్టిఫికెట్: విశ్వక్ సేన్

తన తాజా సినిమా ‘లైలా’కు సెన్సార్ బోర్డు ‘A’(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చిందని హీరో విశ్వక్ సేన్ వెల్లడించారు. మూవీ చూస్తే ‘A’ సర్టిఫికెట్ ఎందుకో అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ప్రేక్షకులు రొటీన్ మూవీస్ని చూడటం లేదు. అందుకే ఇలాంటి విచిత్రమైన కథను సెలక్ట్ చేశాం. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కానీ లేడీ గెటప్ వేయడమే కష్టంగా అనిపించింది’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 30, 2025
విత్తనాల కొనుగోలుకు ₹110 కోట్ల బ్యాంకు రుణం

AP: రబీ(2025-26)లో పంపిణీ కోసం అవసరమైన విత్తనాల కొనుగోలుకు ఏపీ సీడ్ కార్పొరేషన్ ₹110 కోట్ల రుణం తీసుకోనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి తీసుకొనే ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ రుణాన్ని తీర్చలేని పక్షంలో ఈ గ్యారంటీ వర్తిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు, ముందస్తు క్లోజర్కు సున్నాఛార్జీలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ రుణంతో రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తారు.
News October 30, 2025
ఇంట్లో పూజ గది ఏవైపున ఉండాలి?

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అది కుదరకపోతే.. తూర్పు/పడమర వైపు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ‘ప్రతి ఇంట్లో పూజా మందిరం తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని నియంత్రిస్తూ, భక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. అయితే.. ఆ గదిలో స్వర్గస్తుల ఫొటోలు ఉండకూడదు. నవగ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా శుభం కాదు. కులదేవతా ఫొటోలు మాత్రం ఉండవచ్చు’ అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 30, 2025
ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల

TG: తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున అందజేస్తామన్నారు. ఖమ్మంలో వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. 4.5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశుసంపద, ఇళ్లు నష్టపోయిన వారినీ ఆదుకుంటామని చెప్పారు. రేపటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారన్నారు.


