News September 29, 2024
మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలి: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి రూ.1.50 లక్షల కోట్ల మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నారు. తొందరపడి మీ ప్రాణాలు బలితీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి. మేమూ ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 23, 2026
27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి

కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఢిల్లీలోని భారత్ మండపంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లతో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు జరగడం గత 27 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 1999లో ఈ మీటింగ్ నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణలో ECI, SECల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం దీని ఉద్దేశం. ఎన్నికల చట్టాలు, EVMలు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు.
News February 23, 2026
విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి ఎగ్జామ్స్

TG: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20న ఎగ్జామ్స్ ముగుస్తాయి. సమాధాన పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఓవరాల్గా 23న ఫలితాలు విడుదల చేస్తారు. అదే రోజు బడుల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.
News February 23, 2026
అపరాల పంటల్లో తెల్లదోమ.. నివారణ ఎలా?

తెల్లదోమ అపరాల పంట ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు పాలిపోయి నల్లగా కనబడతాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ (పల్లాకు తెగులు) అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తాయి. పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గుర్తించి కాల్చివేయాలి. తెల్లదోమ నివారణకు పొలంలో ఎకరానికి 20-25 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేయాలి.


