News October 3, 2024
ఫేక్ SBI బ్రాంచ్ పెట్టి రూ.లక్షలు దోచారు

ఈమధ్య సైబర్ నేరాలను తరచూ చూస్తున్నాం. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో కొందరు కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ SBI బ్రాంచ్ ప్రారంభించారు. అందులో ఉద్యోగాలు, శిక్షణ పేరుతో మోసగించి రూ.లక్షలు దండుకున్నారు. నిజమైన బ్యాంకులాగే ఉండటంతో ఈ మోసం గ్రహించలేకపోయిన ప్రజలు కొత్త అకౌంట్లు, లావాదేవీల కోసం రావడం ప్రారంభించారు. అందులో ఉద్యోగం పొందినవారు సైతం నిజం తెలిసి షాకయ్యారు.
Similar News
News December 30, 2025
చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కోల్డ్ చేస్తుందని అనుకుంటారు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ నేచురల్ హైడ్రేట్స్‌గా పనిచేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. స్కిన్‌ను పొడిబారకుండా కాపాడుతాయి. పొటాషియం బీపీని నియంత్రించడమే కాకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్కౌట్ తర్వాత/మధ్యాహ్నానికి ముందు తాగితే మంచిది. ఇవి సేఫ్, స్మార్ట్ & రిఫ్రెషింగ్ ఛాయిస్ కూడా.
News December 30, 2025
లంకతో చివరి టీ20.. స్మృతి ప్లేస్‌లో 17 ఏళ్ల అమ్మాయి ఎంట్రీ

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న చివరి(5వ) టీ20లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. స్మృతి మంధానకు రెస్ట్ ఇచ్చారు. ఆమె స్థానంలో 17 ఏళ్ల కమలిని తొలి మ్యాచ్ ఆడనున్నారు.
IND: షెఫాలీ, కమలిని, రిచా, హర్మన్, హర్లీన్, దీప్తి, అమన్‌జోత్, స్నేహ్ రాణా, అరుంధతీ రెడ్డి, వైష్ణవి, శ్రీచరణి
SL: పెరెరా, ఆటపట్టు, దులానీ, హర్షిత, దిల్హారి, నీలాక్షిక, రష్మిక సెవ్వండి, నుత్యాంగన, నిమశ, రణవీర, మాల్కి
News December 30, 2025
IPLలో రూ.13కోట్లు.. ENG వరల్డ్‌కప్ టీమ్‌లో నో ప్లేస్

SRH భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు T20 2026 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన IPL మినీ వేలంలో రూ.13కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లీగ్ T20లో బాగా పెర్ఫామ్ చేసిన లియామ్‌ను టీమ్‌లోకి తీసుకోకపోవడంతో SRH యాజమాన్యం, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. యాషెస్ సిరీస్‌లో విఫలమైన వికెట్ కీపర్ జెమీ స్మిత్‌కూ చోటు దక్కలేదు.


