News March 2, 2025

సీఎంకు లక్ష్మణ్ సవాల్

image

TG: కేంద్ర నిధులపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి ఎన్ని నిధులిచ్చారు? మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు ఎన్ని నిధులిచ్చారో చర్చకు రావాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి రేవంత్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై కాంగ్రెస్, BRS రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Similar News

News November 13, 2025

క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

image

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.

News November 13, 2025

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ గురించి తెలుసా?

image

లాక్టోజ్ ఇన్​టాలరెన్స్ ఉన్నవారిలో పాలపదార్థాల్లో ఉండే లాక్టోజ్​ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాదు. దీంతో కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వస్తాయి. వీరు రాగులను నానబెట్టి రుబ్బి తీసిన పాలు, రాగిజావ, రాగి మాల్ట్‌, ఓట్ మిల్క్, సోయా పాలు వంటివి తీసుకోవచ్చంటున్నారు. అలాగే ఆకుకూరలు, చేపలు, బోన్ సూప్ ఆహారంలో చేర్చుకున్నా శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.

News November 13, 2025

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

image

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.