News August 13, 2024

లక్ష్య సేన్ ఏకాగ్రత చెదిరింది: సునీల్ గవాస్కర్

image

ఏకాగ్రత చెదరడంతోనే బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ ఒలింపిక్ పతకాన్ని అందుకోలేకపోయారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘సెమీ ఫైనల్‌లో 20-17, 7-0 లీడ్ నుంచి, కాంస్య పతకం మ్యాచ్‌లో గెలిచే స్థానం నుంచి లక్ష్య ఓడిపోవడం బాధించింది. కీలక సమయంలో ఏకాగ్రత కోల్పోయారు. నేను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ టీవీలో చూస్తున్నప్పుడు నాకైతే అదే అనిపించింది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 13, 2025

జగన్.. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపండి: సత్యకుమార్

image

AP: మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని YS జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. 17 కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధమన్నారు. రూ.8,450 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి, రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు. జగన్‌లా తాము విఫలం కావొద్దని PPPని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. పీపీపీకి, ప్రైవేటీకరణకు తేడా ఉందని చెప్పారు.

News September 13, 2025

రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

image

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.

News September 13, 2025

నిద్రలోనే చనిపోయిన 19 మంది స్టూడెంట్స్

image

మయన్మార్‌లో అంతర్గత ఘర్షణలకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి రఖై రాష్ట్రంలోని క్యాక్తాలో రెండు ప్రైవేట్ స్కూళ్ల‌పై డ్రోన్ల దాడి జరగడంతో 19 మంది స్టూడెంట్స్ నిద్రలోనే కన్నుమూశారు. 22 మంది గాయపడినట్లు అరాకన్ ఆర్మీ తెలిపింది. డ్రోన్లతో బాంబులను జారవిడిచారని, ఇది మయన్మార్ మిలిటరీ పనేనని ఆరోపించింది. కాగా కొన్నాళ్లుగా అరాకన్ ఆర్మీ, మయన్మార్ మిలిటరీ మధ్య ఘర్షణ జరుగుతోంది.