News August 4, 2024

లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు లక్ష్యసేన్ ఫేవరెట్: అక్సెల్‌సెన్

image

పారిస్ ఒలింపిక్స్‌లో యువ షట్లర్ <<13776256>>లక్ష్యసేన్<<>> ప్రదర్శనపై డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్‌సెన్ ప్రశంసలు కురిపించారు. ‘2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌కు లక్ష్యసేనే ఫేవరెట్‌. ఈ టోర్నీలో ఇప్పటివరకు నేను ఆడిన మ్యాచుల్లో తనతో జరిగిన గేమే అత్యంత కష్టమైనది. తన ప్రదర్శనతో లక్ష్యసేన్ బలమైన ప్రత్యర్థిగా నిరూపించుకున్నాడు’ అని పేర్కొన్నారు. కాగా సేన్ సోమవారం బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో పాల్గొంటారు.

Similar News

News March 27, 2026

ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

image

ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానీయన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్‌నిచ్చింది.

News March 27, 2026

IPL 2026 ఓపెనింగ్ సెరిమనీ రద్దు!

image

ఈ ఏడాది IPL ఓపెనింగ్ సెరిమనీ ఉండదు. గతేడాది జూన్ 4న బెంగళూరు స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈసారి వేడుకలు నిర్వహించొద్దని BCCI నిర్ణయించింది. అందుకే శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్ ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయట్లేదు. అయితే మే 31న జరిగే ఫైనల్ రోజు మాత్రం గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ ప్లాన్ చేస్తున్నారు.

News March 27, 2026

రీజినల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ DPR రెడీ!

image

TG: RRR సౌత్ పార్ట్ పనుల్లో కేంద్రం స్పీడ్ పెంచింది. DPR కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటికే DPR తయారీకి కన్సల్టెన్సీని అపాయింట్ చేసినట్లు తెలిపారు. నార్త్ పార్ట్ పనులు టెండర్ స్టేజ్‌లో ఉండగా ఇప్పుడు సౌత్ పార్ట్ విషయంలోనూ ముందడుగు పడటం విశేషం.