News October 3, 2025

రాజధానికి భూసేకరణ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

image

AP: రాజధాని అమరావతికి భూ సేకరణ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి రూ.65,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News October 3, 2025

మూడో భార్యకూ విడాకులు ఇవ్వనున్న మాలిక్?

image

సానియా మీర్జా మాజీ భర్త, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య సనా జావెద్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆమె మూడో భార్య కాగా ఇది మూడో విడాకులు. తొలుత ఆయేషాను పెళ్లాడిన మాలిక్ 8 ఏళ్ల తర్వాత ఆ బంధానికి ముగింపు పలికారు. 2010లో సానియాను పెళ్లాడారు. 13 ఏళ్ల తర్వాత ఆమెకూ విడాకులిచ్చారు. వీరికి ఓ కొడుకు ఉన్నారు. ఇక 2024లో సనాను పెళ్లి చేసుకున్న ఆయన ఏడాదిలోనే విడాకులకు సిద్ధమయ్యారు.

News October 3, 2025

ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొంటూ ముందుకెళ్లాలి: CBN

image

AP: MLAలను సమన్వయం చేసుకొంటూ జిల్లాల్లో పార్టీ, ప్రభుత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని క్యాబినెట్ భేటీలో CM CBN మంత్రులను ఆదేశించారు. అలాగే కొంతమంది శాసనసభ్యుల గురించి ప్రస్తావన రాగా వారిని నియంత్రించాల్సిన బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు తెలిసో తెలియకో కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారని, వారితో మాట్లాడాలని సూచించారు. విపక్షాల విమర్శలను వెంటనే తిప్పికొట్టాలని చెప్పారు.

News October 3, 2025

యుద్ధాన్ని ముగించకపోతే హమాస్‌కు నరకమే: ట్రంప్

image

ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించాలని హమాస్‌కు US ప్రెసిడెంట్ ట్రంప్ గడువు విధించారు. ఆదివారంలోగా దీనిపై ఒప్పందం చేసుకోకపోతే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ‘హమాస్ చాలా ఏళ్లుగా మిడిల్ ఈస్ట్‌లో హింసాత్మక ముప్పుగా ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించింది. ఆ దాడికి ప్రతీకారంగా ఇప్పటివరకు 25,000+ హమాస్ సైనికులు హతమయ్యారు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.