News November 24, 2024

ప్రాణం తీసినా భూములిచ్చేది లేదు: లగచర్ల రైతులు

image

TG: తమ ప్రాణాలు తీసినా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని లగచర్ల రైతులు స్పష్టం చేశారు. NHRC బృందం లగచర్ల, రోటితండా, పులిచర్లకుంటతండాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా వారికి బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ ప్రాంతంలో కంపెనీలు వద్దని, తమ భర్తలపై పెట్టిన కేసులు కొట్టేసి విడిచిపెట్టాలని మహిళలు కోరారు.

Similar News

News November 24, 2024

ప్రయాణికులున్న RTC బస్సులో ఉరేసుకొని ఆత్మహత్య

image

AP: తిరుపతి జిల్లాలోని ఏర్పేడులో ఓ వ్యక్తి RTC బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేర్లపాక వద్ద బస్సు ఎక్కిన యువకుడు బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉండటంతో వెనుకవైపు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న తాడుతో బస్సులోనే ఉరివేసుకున్నాడు. ఏర్పేడు వద్ద కండక్టర్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2024

లీగ‌ల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్

image

త‌న భార్య‌తో విడాకుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న మాధ్యమాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ AR రెహమాన్ లీగ‌ల్ నోటీసులు పంపారు. త‌న‌ను, త‌న కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకొని అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారు 24 గంట్ల‌లోపు వాటిని తొల‌గించాల‌న్నారు. రెహమాన్‌తో క‌లిసి ప‌నిచేసిన బాసిస్ట్ మోహినిడే కూడా త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకోవ‌డంతో వీరిద్దరూ క‌లుస్తున్న‌ట్టు వార్తలొచ్చాయి.

News November 24, 2024

త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు

image

భార‌త్‌లో మొద‌టి హైడ్రోజ‌న్ రైలు డిసెంబ‌ర్‌లో ప‌ట్టాలెక్క‌నుంది. ఈ ప‌ర్యావ‌ర‌ణ అనుకూల రైలును హ‌రియాణాలో 90KM దూరం క‌లిగిన జింద్-సోనిపట్ మ‌ధ్య న‌డ‌ప‌నున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొని నీటి ఆవిరిని విడుదల చేయడం దీని ప్రత్యేకత. ఇతర రైళ్లతో పోలిస్తే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయి. 2025 నాటికి ఇలాంటి 35 రైళ్లను పట్టాలెక్కించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.