News January 31, 2025
రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు

APవ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10-20% పెంపు ఉండనుంది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6% వరకు పెంపు ఉంటుంది. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు ₹740, ₹580, ₹420 వసూలు చేస్తారు. ప్లాట్లకు(G,1st, 2nd ఫ్లోర్)రూ.1,490, రూ.1,270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.
Similar News
News November 7, 2025
వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.
News November 7, 2025
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
₹1,01,899 CR పెట్టుబడులకు CBN ఆమోదం

AP: రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చూడడంతో పాటు పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. భూమి, ఇతర రాయితీలు పొందిన వాటిని సమీక్షించి పురోగతి లేకుంటే రద్దు చేయాలని SIPB భేటీలో స్పష్టం చేశారు. ల్యాండ్ బ్యాంకును ఏర్పాటుచేయాలని సూచించారు. కాగా భేటీలో ₹1,01,899 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు.


