News June 12, 2024
త్వరలో భూముల మార్కెట్ విలువ పెంపు?

TG: భూముల మార్కెట్ విలువను ఏ మేరకు పెంచవచ్చనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచే అవకాశం ఉండగా, అపార్టుమెంట్ల విలువను పెద్దగా పెంచకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ స్థలాల విషయానికి వస్తే HYD పరిసర జిల్లాల్లో వాస్తవ ధరలు ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట పెంపు ఉండొచ్చంటున్నారు.
Similar News
News January 7, 2026
ఫోన్ ట్యాపింగ్.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇటీవల నవీన్‌రావు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
News January 7, 2026
పండుగకి ఊరెళ్తున్నారా?

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్లేముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించడం శ్రేయస్కరం. ఇంటికి రెండు ద్వారాలు ఉంటే రహదారికి కనిపించే తలుపుకు లోపల, మరో వైపున్న తలుపుకు బయటివైపు తాళం వేయాలి. ఆ తాళం బయటకు కనిపించకుండా కర్టైన్స్ వేయడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో బంగారం, నగదు వదిలి వెళ్లవద్దని కోరుతున్నారు.
News January 7, 2026
కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత, లిట్టర్ నిర్వహణ కీలకం

శీతాకాలంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ సమయం ఉండటం వల్ల కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత విషయంలో, నేల మీద పరిచే వరిపొట్టు(లిట్టర్) విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టులో తేమ పెరగకుండా 7 నుంచి 11 కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫేట్ 100 చదరపు అడుగుల లిట్టర్‌కు చేర్చాలి. వారానికి 2-3 సార్లు లిట్టర్‌ను కలియబెట్టాలి. ఇలా చేయడం వలన లిట్టర్లో తేమ తగ్గి కోడిపిల్లలు కోకిడియోసిస్‌కు గురి కాకుండా కాపాడుకోవచ్చు.


